హైదరాబాద్, జూలై 28: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..విమాన టికెట్లపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ‘పేడే సేల్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద టికెట్లపై 15 శాతం వరకు తగ్గింపు ధరతో అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 1 వరకు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తించనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మార్చి 31, 2026 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని తెలిపింది.
www.airindiaexpress.com, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. దీంతోపాటు బ్యాగేజీపై కూడా డిస్కౌంట్ కల్పిస్తున్నది. అదనంగా తీసుకుపోయే 15 కిలోల సరుకునకు రూ.1,000, అంతర్జాతీయ రూట్లో 20 కిలోల బ్యాగేజీకి రూ.1,300 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.