జియోమార్ట్‌తో సై.. సెప్టెంబర్‌లో టాటా సూపర్ యాప్ సేవలు షురూ!
జియోమార్ట్‌తో సై.. సెప్టెంబర్‌లో టాటా సూపర్ యాప్ సేవలు షురూ! ఈ-కామర్స్ సేవలను ప్రారంభించేందుకు టాటా సన్స్ అనుబంధ టాటా డిజిటల్ సిద్ధం..

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సేవలను ప్రారంభించేందుకు టాటా సన్స్ అనుబంధ టాటా డిజిటల్ సిద్ధం అవుతున్నది. సెప్టెంబర్‌లో బెంగళూరు కేంద్రంగా టాటా డిజిటల్ తన సూపర్ యాప్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నది. ఈ-కామర్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ తదితర విస్తృత శ్రేణి ఉత్పత్తులను డెలివరీ చేయనున్నది.
ఈ-కామర్స్ బిజినెస్ ప్రారంభించడానికి అవసరమైన నిధుల సేకరణపై టాటా సన్స్ కేంద్రీకరించింది. ఓవర్సీస్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 2-2.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే విషయమై చర్చిస్తున్నది. ఇందుకోసం గత నెలలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అమెరికాలో పర్యటించారు.
ఈ-కామర్స్ బిజినెస్‌లో ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన రిలయన్స్ జియోమార్ట్, అమెజాన్ ఇండియా, వాల్‌మార్ట్ సారధ్యంలోని ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలతో పోటీ పడేందుకు టాటా డిజిటల్ సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరిగింది.
టాటా డిజిటల్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాత్మక పెట్టుబడి దారుల నుంచి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు గల ఆప్షన్లను టాటా సన్స్ పరిశీలిస్తున్నది. ఇప్పటికే హెల్త్ అండ్ ఫిట్నెస్ స్టార్టప్ క్యూర్ ఫిట్ సహా వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సాల్.. టాటా డిజిటల్లో అధ్యక్షుడిగా చేరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

