Startup | న్యూఢిల్లీ, నవంబర్ 9: నిధులు ఆకర్షించడంలో దేశీయ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతవారంలో 138 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. వీటిలో మూడు అతిపెద్ద స్టార్టప్‌లు కాగా, మరో 20 ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లు. కనీసంగా 25 స్టార్టప్‌లు 138.7 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయని సర్వే వెల్లడించింది.
వీటిలో ఫిన్‌టెక్, డీప్‌టెక్ స్టార్టప్‌లు అత్యధికంగా నిధులను ఆకర్షించగా, వీటిలో 50 మిలియన్ డాలర్ల విలువైన రెండు ఒప్పందాలు ఉన్నాయి. దీంట్లో ఫిన్‌టెక్ స్టార్టప్ ఈజీ హోమ్ ఫైనాన్స్ 35 మిలియన్ డాలర్ల నిధులను ఒకేసారి సేకరించింది. అలాగే మోదీఫై 15 మిలియన్ డాలర్లు, సైన్ఎల్ఆర్ 10 మిలియన్ డాలర్లు, గెలాక్సీఐ 10 మిలియన్ డాలర్లు సేకరించాయి. దీంతో ప్రస్తుతేడాది దేశీయ స్టార్టప్‌లు 12.2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. 2023లో మొత్తంగా సేకరించిన 11 బిలియన్ డాలర్ల కంటే ఇది అధికం.