Maruti Suzuki | ఆడి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా బాటలోనే మారుతి సుజుకి ప్రయాణిస్తున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు నాలుగు శాతం పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మోడల్స్ వారీగా ధరల్లో మార్పులు ఉంటాయని వివరించింది. కార్ల తయారీ ఖర్చులు పెరిగిపోవడంతో కొంత భారం కస్టమర్లపై మోపక తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది.
జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయని ఈ నెల ప్రారంభంలోనే ఆడి ఇండియా ప్రకటించింది. అన్ని రకాల మోడల్ కార్లపై మూడు శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఆడీ ఏ4, ఆడి క్యూ7, ఆడి ఈ-ట్రాన్ జీటీ, ఆడీ ఆర్ఎస్ క్యూ8 మోడల్ కార్లు అత్యంత పాపులర్. అన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.25 వేల వరకూ అన్ని కార్ల ధరలు పెంచుతామని గురువారం హ్యుండాయ్ మోటార్స్ ప్రకటించింది.