హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ): ఖాయిలాపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఐ సీఎండీ సంజయ్బంగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్లాంట్ పునరుద్ధరణ ప్రతిపాదనలపై చర్చించారు.
ప్లాంట్ తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రూ. 2 వేల కోట్ల నిధులు అవసరమని, తద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.