న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశీయ కుబేరుడిలో ఒకరైనా అదానీ గ్రూపు.. వ్యవసాయ రంగం బిజినెస్ నుంచి వైదొలిగారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మార్)లో తనకున్న మిగతా వాటాను రూ.2,500 కోట్లకు విక్రయించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్కు చెందిన అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీకి వున్న ఏడు శాతం వాటాను ఇటీవల విక్రయించింది. ఒక్కో షేరుకు రూ.275 చొప్పున విక్రయించింది. గత ముగింపుతో పోలిస్తే స్వల్పంగా రాయితీ ఇచ్చింది.