న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టివా కూడా ఈవీ రూపంలో విడుదల చేయడానికి హోండా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఈవీ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో సంస్థ..యాక్టివా 7జీ మోడల్‌తోపాటు ఈవీ స్కూటర్‌ను సైతం విడుదల చేయనున్నది. దీనిపై సంస్థ ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. దీని ధర లక్ష రూపాయల స్థాయిలో ఉంటుందని అంచనా. 109.51 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో ఈ బైకును సంస్థ రూపొందించింది.