Acer Swift Go 2023 | ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్.. భారత్ మార్కెట్లోకి ఏసర్ స్విఫ్ట్ గో-2023 లాప్టాప్ తెచ్చింది. 400 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో 14-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే వస్తున్న థిన్ లైట్‌వెయిట్ లాప్టాప్ ఇది. విండోస్ 11 హోం ఔట్ ఆఫ్బాక్స్ వర్షన్‌తో నడుస్తుంది. ఇది 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. 13థ్ జెన్ ఇంటెల్ కోర్ ఐ5-13500 హెచ్ ప్రాసెసర్ (13th Gen Intel Core i5-13500H processor)తో నడుస్తుంది.
భారత్ మార్కెట్లో ఏసర్ స్విఫ్ట్ గో-2023 (Acer Swift Go-2023) 16 జీబీ + 512 జీబీ స్టోరేజీ కాన్ఫిగరేషన్ గల లాప్టాప్ ధర రూ.79,990గా నిర్ణయించారు. ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఏసర్ ఈ-స్టోర్, క్రోమా, విజయ్ సేల్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ వేదికగా కొనుగోలు చేయవచ్చు.
400 నిట్స్ బ్రైట్‌నెస్‌తోపాటు 14 అంగుళాల (డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ + 2880 x 1800 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తున్న ఏసర్ స్విఫ్ట్ గో-2023 లాప్టాప్. వందశాతం డీసీఐ-పీ3 కలర్ గమట్ కవరేజీ ఉంటుంది. 65డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ యూనిట్ వయా యూఎస్బీ టైప్-సీ పోర్ట్ & విత్ సపోర్ట్ 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. 30 నిమిషాలు చార్జింగ్ పెడితే నాలుగు గంటలు నిరంతరంగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 80 శాతం వరకు థర్మల్ పెర్ఫార్మెన్స్ మెరుగు పరిచేందుకు ట్విన్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తున్నది.
ఏసర్ స్విఫ్ట్ గో-2023 (The Acer Swift Go-2023)లో స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి. వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. డ్యూయల్ యూఎస్బీ 3.2 పోర్ట్స్, యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, యూఎస్బీ 3.2 పోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, హెచ్డీఎంఐ 1.4 పోర్ట్, డెడికేటెడ్ ఎస్డీ కార్డ్ స్లాట్ తదితర ఫీచర్లు ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
ఈ లాప్టాప్లో టీ-టైప్ యూఎస్బీ కెమెరా విత్ సపోర్ట్ ఫర్ రికార్డింగ్ 1440పీ (ఖ్వాడ్-హెచ్డీ) వీడియో ఎట్ 30 ఎఫ్‌పీఎస్ వద్ద లభిస్తుంది. ఇందులో విండోస్ 11 హోం, ఎంఎస్ ఆఫీస్ వంటి సాఫ్ట్వేర్ ముందుగానే ఇన్ స్టాల్ చేస్తారు. మల్టీ గెస్చర్ టచ్‌పాడ్, సపోర్టింగ్ టూ ఫింగర్ స్క్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొర్టానా, యాక్షన్ సెంటర్, మల్టీ టాస్కింగ్, అప్లికేషన్ కమాండ్స్ కలిగి ఉంటుంది.