Jan Dhan Accounts | సామాన్య భారతీయులను సంపన్నులను చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ‘జన్ ధన్ (ప్రధానమంత్రి జన్ ధన్ యోజన – పీఎంజేడీవై)’ ఖాతాలపై కేంద్ర కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఆరో తేదీ నాటికి దేశవ్యాప్తంగా 10.34 కోట్ల జన్ ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయని మంగళవారం చెప్పారు. వాటిల్లో 4.93 కోట్ల మహిళల ‘జన్ ధన్’ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయని రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులడిగిన ప్రశ్నకు రాత పూర్వక సమాధానమిస్తూ భగవత్ కే కరాడ్ చెప్పారు.
పీఎంజేడీవై ఖాతాలు సుమారు 51.11 కోట్లు ఉన్నాయని బ్యాంకులు ఇచ్చిన డేటా చెబుతున్నదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాడ్ తెలిపారు. వాటిల్లో దాదాపు 20 శాతం నిరుపయోగంగా మారాయన్నారు. బ్యాంకింగ్ రంగంలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలతో సమానంగా జన్ ధన్ ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఇన్ ఆపరేటివ్ పీఎంజేడీవై ఖాతాల్లో రూ.12,779 కోట్ల మనీ డిపాజిట్ చేసి ఉన్నాయని, బ్యాంకుల్లోని ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తం సుమారు 6.12 శాతం అని చెప్పారు.