హైదరాబాద్, జనవరి 28: ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే మూడేండ్లకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఆటోమేషన్, నావిగేషన్ సిస్ట మ్స్, ఇతక కీలక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి రూ.15 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ చైర్మన్ విపిన్ కుమార్ తెలిపారు. దేశంలో అతిపెద్ద విమానాశ్రయాల నిర్వహణ సంస్థ అయిన ఏఏఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. 2028 చివరినాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఏటీసీ టవర్లు ఆటోమేషన్, నావిగేషన్ సిస్టమ్స్‌ను భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆధునీకరించనున్నట్టు చెప్పారు.