హైదరాబాద్, ఆగస్టు 18 : స్లోకా అడ్వైర్టెజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్… అడ్వైర్టెజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఏఐ) బోర్డు డైరెక్టర్గా మళ్లీ ఎంపికయ్యారు. గడిచిన 30 ఏండ్లుగా ప్రకటనలో విభాగంలో సేవలు అందిస్తున్న ఆయన.. దేశీయ ప్రకటనల రంగంలో తనదైన ముద్రవేశారు. ప్రకటనలో రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఏఏఐ బోర్డుకు తిరిగి ఎన్నికవడం, విశిష్ఠ నాయకులతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తాను. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనా శ్రీనివాసన్ కే స్వామికి ప్రత్యేక అభినందనలు. ప్రకటనల పరిశ్రమల ఇతర దిగ్గజాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, నైతిక, ప్రగతిశీల వాతావరణాన్ని పెంపొందించడానికి నిరంతరంగా కృషి చేయనున్నట్టు చెప్పారు.