న్యూఢిల్లీ : రెండు చేతులా ఆర్జించాలనే కోరికతో ఓ అమెరికన్ టెకీ (Techie) భారీ స్కెచ్ వేశాడు. రిమోట్ వర్కింగ్‌లో పై అధికారుల కండ్లు కప్పి రెండేండ్ల పాటు ఒకేసారి రెండు ఉద్యోగాలను చేసి భారీ మొత్తం దండుకున్నాడు. దీంతో అతడు ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనం ఆర్జించాడు. తన డబుల్ వర్క్ అనుభవాలను అతడు బిజినెస్ ఇన్సైడర్తో పంచుకున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ నికోలస్ ఫ్లెమింగ్ 2021 నుంచి తన మాజీ బాస్ రిఫర్ చేయడంతో రెండో ఉద్యోగంలో కుదురుకుని డబుల్ జాబ్స్ ప్రస్ధానం సాగించాడు.
సొంత ఇల్లు, వెకేషన్స్, ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్స్‌తో డబుల్ జాబ్‌కు మొగ్గుచూపానని, రెండో ఉద్యోగం గురించి కంపెనీకి తెలియనంతవరకూ మేనేజ్ చేయాలని అనుకున్నానని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. డబుల్ ఇన్‌కం వచ్చినా తాను అదే జీవనశైలిని కొనసాగించానని, పాత కార్‌ను వాడుతూ ఎకానమీ ఫ్లైట్స్‌లో ప్రయాణించడంతో పాటు 2-3 స్టార్ హోటల్స్‌లో బస చేసేవాడనని చెప్పాడు. రెండు జాబ్‌లు చేస్తూ గత రెండేండ్లుగా ఫ్లెమింగ్ రూ. 1.2 కోట్లు ఆదా చేశాడు. అదనపు ఆదాయంతో తనకు భారీ సంపద ఏమీ రాలేదని, సొంతింటి కల కూడా సాకారమయ్యే పరిస్ధితి లేదని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
తన రాబడిని మరింత పెంచుకునేందుకు ఫ్లెమింగ్ మూడో కంపెనీ కోసం కూడా గత రెండేండ్లలో రెండు సార్లు మూన్‌లైటింగ్ ప్రయోగం చేశాడు. ఒకేసారి మూడు కొలువుల్లో నెగ్గుకురావడం అసాధ్యమని గుర్తించాడు. ఒకేసారి మూడువిషయాలపై తాను ఫోకస్ చేయలేనని స్పష్టమైందని అన్నాడు. ఓ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీ మీటింగ్స్‌లో ఫ్లెమింగ్ పాల్గొనేవాడు. ఈ రెండేండ్లలో అదృష్టవశాత్తూ రెండు కంపెనీల్లో ఒకే సమయంలో పనిచేయాల్సిన అవసరం రాకపోవడం ఫ్లెమింగ్‌కు కలిసివచ్చింది.
Read More :