హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 ( నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రియల్టీ రంగంలో దూసుకుపోతున్న సుమధుర.. ఒలంపస్ నిర్మాణ రంగంలో కొత్త రికార్డును సృష్టించింది. 67.5 గంటల సమయంలోనే 7,479 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తిచేసింది. సుమధుర గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ వేవ్‌రాక్ సమీపంలో ఐదున్నర ఎకరాల్లో 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో చేపట్టిన ‘ద ఒలంపస్’ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు ఎక్కడా చిన్నపాటి పగుళ్లు లేకుండా పూర్తి చేశామని సుమధుర గ్రూప్ చైర్మన్ మధుసూదన్, వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు.