Salary | జీతాలు పెరుగుతాయ్.. 90 శాతం ఉద్యోగుల్లో అదే విశ్వాసం
Salary | ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇందులో 2 వేల మంది భారతీయులూ పాల్గొన్నారు. ఈ వివరాలను ఏడీపీ సోమవారం విడుదల చేసింది.
Salary | ముంబై, ఏప్రిల్ 24: ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇందులో 2 వేల మంది భారతీయులూ పాల్గొన్నారు. ఈ వివరాలను ఏడీపీ సోమవారం విడుదల చేసింది. వీరిలో 90 శాతం మంది ఈ ఏడాది జీతాలు ఎంతోకొంత పెరుగుతాయన్న ఆశతో ఉండగా, వారిలో 20 శాతం మంది 4-6 శాతం పెరగొచ్చంటున్నారు. ఇక 19 శాతం మంది 10-12 శాతం హైక్ ఉంటుందన్న అంచనాల్ని కనబర్చారు. కాగా, ఒకవేళ ఈ ఏడాది వేతనాలు పెరుగకపోయినా.. మెరిట్ బోనస్, పెయిడ్ హాలిడేస్ లేదా ట్రావెల్ కాంపెన్సేషన్ వంటివైనా వస్తాయని దేశంలోని 65 శాతం మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది.
అయితే ఇదే సమయంలో పెరిగిన ఖర్చులు, పడిపోతున్న లాభాలు ఆయా కంపెనీలకు ఇబ్బందికరంగా మారాయని, దీంతో జీతాల పెంపు సంస్థలకు కత్తిమీద సామే అయ్యేలా ఉందని సర్వే పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీతాలు పెరుగకపోతే ఉద్యోగులు సంస్థల్ని మార్చే దిశగా అడుగులు వేసే వీలు కూడా లేకపోలేదని ఏడీపీ ఇండియా ఎండీ రాహుల్ గోయల్ అన్నారు. కాగా, గత ఏడాది భారత్లో 78 శాతం వర్కర్స్కు సగటున 4-6 శాతం జీతాలు పెరిగాయని ఈ సందర్భంగా ఏడీపీ గుర్తుచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

