సోమవారం 01 మార్చి 2021
Business - Feb 05, 2021 , 21:46:44

ఎల్టీసీ కింద ఐటీ మిన‌హాయింపులు ఇలా.

ఎల్టీసీ కింద ఐటీ మిన‌హాయింపులు ఇలా.

న్యూఢిల్లీ: దేశంలోని ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వోద్యోగుల‌కు శుభ‌వార్త‌. లీవ్ ట్రావెల్ క‌న్సెష‌న్ (ఎల్టీసీ) కింద పొందిన డ‌బ్బుపై ఆదాయం ప‌న్ను (ఐటీ) చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని కేంద్రం తెలిపింది. కేంద్ర బ‌డ్జెట్‌-2021లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల గ‌తేడాది అక్టోబ‌ర్ 12వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వోద్యోగుల‌కు ఎల్టీసీ కింద మిన‌హాయింపునిచ్చింది. ఇప్ప‌టికీ క‌రోనా ముప్పు పొంచి ఉన్నందున ఎల్టీసీ కింద కేంద్ర ప్ర‌భుత్వోద్యోగుల‌కు 2018-21 మ‌ధ్య ఐటీ మిన‌హాయింపుల‌ను ఇస్తోంది.ఈ రిలీఫ్ ఉద్యోగుల‌కంద‌రికి వ‌ర్తిస్తుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో తెలిపారు.  

క‌రోనా నేప‌థ్యంలో నాలుగేండ్ల పాటు కేంద్రం క‌ల్పించిన ఎల్టీసీ క్యాష్ వోచ‌ర్ స్కీమ్ వ‌చ్చేనెల 31తో ముగియ‌నున్న‌ది. ఉప‌యోగించుకోని ఉద్యోగుల అవ‌కాశాలు ల్యాప్స్ అవుతాయి. వ‌చ్చే మార్చి 31లోపు  ఎల్టీసీ ఫేర్‌కు మూడు రెట్లు  గూడ్స్‌, స‌ర్వీసులు, ఒక లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. వీటికి 12, అంత‌కంటే ఎక్కువ జీఎస్టీ అమ‌లై ఉండాలి. ఒక్కో వ్య‌క్తికి ఎల్టీసీ మిన‌హాయింపు రూ.36 వేలు దాటొద్దు. రూ.36 వేల ఎల్టీసీ మిన‌హాయింపు స‌వ‌ర‌ణ వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo