కేంద్ర ఉద్యోగులకు రిలీఫ్.. జూలై నుంచి డీఏ పెంపు..!
కేంద్ర ఉద్యోగులకు రిలీఫ్| కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రిలీఫ్ లభించనున్నది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి వారికి కరువు భత్యం (డీఏ) ..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రిలీఫ్ లభించనున్నది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి వారికి కరువు భత్యం (డీఏ) చెల్లింపులు అమలులోకి రానున్నది. మూడు వాయిదాల డీఏను జూలై ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
సవరించిన రేట్ల ప్రకారం డీఏ
గత నెలలో రాజ్యసభలో సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, సవరించిన రేట్ల ప్రకారం చెల్లిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో 2020 జనవరి ఒకటో తేదీ, జూలై ఒకటో తేదీ, 2021 జనవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన డీఏను కేంద్రం పెండింగ్‌లో పెట్టిన సగతి తెలిసిందే.
17 నుంచి 28 శాతానికి డీఏ పెంపు
ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు 17 శాతం డీఏ పొందుతున్నారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం వారి డీఏ పెరుగనున్నది.
2020 జనవరి నుంచి ఇలా డీఏ చెల్లింపు
2020 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు శాతం పెంపుతో 28 శాతం, జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు శాతం, 2021 జనవరి ఒకటో తేదీ నుంచి నాలుగు శాతంతో కలిపి వారి వేతనంలో అందుకోనున్నారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే వేతనం మొత్తం గణనీయంగా పెరుగనున్నది.

1.17 కోట్ల కుటుంబాలకు లబ్ధి ఇలా
డీఏ చెల్లింపును పునరుద్ధరించడంతో 65 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 52 లక్షల మంది ఉద్యోగులకు భారీ రిలీఫ్ లభిస్తుంది. ఒకసారి డీఏ పునరుద్ధరిస్తే పెన్షనర్ల పెన్షన్ కూడా జూలై ఒకటో తేదీ నుంచి పెరుగుతుంది.
కేంద్ర ఉద్యోగుల వేతనంపై డీఏ పెంపు ఇలా
కేంద్ర ప్రభుత్వోద్యోగుల స్థూల వేతనంలో బేసిక్ పే, డీఏ, ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ప్రయాణ భత్యం (టీఏ), వైద్య అలవెన్స్ తదితరాలు కలుస్తాయి.
రూ.3060 నుంచి రూ.5,040 వరకు పెరుగుదల
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు అందుకుంటున్న డీఏ 17 శాతం. ఇది 28 శాతానికి పెరుగుతుంది. దీని ప్రకారం ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి కనీస వేతనం రూ.18 వేలు ఉంటే, నెలవారీగా డీఏ రూ.3,060 నుంచి రూ.5,040 వరకు పెరుగుతుంది.
ఇలా పీఎఫ్, గ్రాట్యూటీ కంట్రిబ్యూషన్
ప్రతిపాదిత డీఏ పెరుగడంతో వారి ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యూటీ కూడా పెరుగుతాయి. కనీస వేతనంలో నిర్దిష్ఠ శాతం, డీఏతో కలిపి పీఎఫ్, గ్రాట్యూటీ భాగస్వామ్యాన్ని నిర్ణయిస్తారు.
ఇవి కూడా చదవండి:
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

