Credit card | క్రెడిట్ కార్డులను సురక్షితంగా వాడితే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ఇష్టారీతిన వాడితే అన్ని నష్టాలూ ఉన్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరుగుతున్న వేళ.. ఏం చేయకూడదు?, ఏం చేయాలన్నది? వినియోగదారులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం దేశంలో 8.6 కోట్లకుపైగా క్రెడిట్ కార్డులున్నాయి. ఈ ఏడాది ఆఖరుకల్లా 10 కోట్లకు చేరవచ్చని అంచనా. కేవలం ఏడాది వ్యవధిలో కోటి మంది వినియోగదారులు పెరిగారు. ఇక ప్రస్తుత కార్డుల్లో గరిష్ఠంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందినవే 1.78 కోట్లు. ఆ తర్వాత ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు వినియోగదారులున్నారు. దేశంలోని క్రెడిట్ కార్డుల్లో 71 శాతం ఈ నాలుగు బ్యాంకులు జారి చేసినవే.