Financial Changes | నూతన టాక్స్ పాలసీ టు హాల్‌మార్క్ బంగారం కొనుగోళ్ల వరకూ.. ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులివే!
Financial Changes | నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను విధానంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Financial Changes | నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతున్నది. ఈ తరుణంలో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడులపై ఓ లుక్ వేయడం మరిచిపోవద్దు. రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా.. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) నిర్ణయంపై దృష్టి పెట్టడం మర్చిపోవద్దు సుమా.. అంతే కాదు..ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి నగదు విత్ డ్రాయల్స్, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్మెంట్లలోనూ మార్పులు జరుగుతాయి. ఏప్రిల్ నెలలో మీ పర్సులో మనీ ఖర్చయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఓ లుకేద్దామా..!

2023-24 నుంచి ఆదాయం పన్ను చట్టంలో మార్పులివే..
- 2023-24 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఐటీ రూల్స్ మార్పుల ప్రభావం ఆదాయం పన్ను చెల్లింపుదారులపై పడనున్నది.
- నూతన పన్ను పాలసీని డిఫాల్ట్‌గా పెడుతున్నట్లు ప్రకటించింది కేంద్రం.
- వేతన జీవులు తమకు తాముగా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే తప్ప.. నూతన పన్ను పాలసీలోనే మీ ఆదాయం, దానిపై పన్ను శ్లాబ్ ఖరారవుతుంది.

నూతన పన్ను పాలసీ కింద రాయితీ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంపు.
- కనీస మినహాయింపులతో నూతన ఆదాయం పన్ను శ్లాబ్‌లు ప్రారంభం.
- లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) ఎన్కాష్మెంట్ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంపు.
- ఒక ఆర్థిక సంవత్సరంలో సంప్రదాయ ఎండోమెంట్ జీవిత బీమా పాలసీల ప్రీమియం రూ.5 లక్షలు దాటితే.. మెచ్యూరిటీ తర్వాత వచ్చే రాబడిపై ఆదాయం పన్ను చెల్లించాల్సిందే.
- షార్ట్‌టర్మ్ క్యాపిటల్ అసెట్స్‌గా మార్కెట్ లింక్డ్ డిబెంచర్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు. ఫిజికల్ గోల్డ్ నుంచి ఎలక్ట్రానిక్ గోల్డ్‌గా మార్చినా నో టాక్స్.

Mutualfunds
డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులపై నో ఎల్టీసీజీ టాక్స్ మినహాయింపు
- ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డెట్ మ్యూచువల్ఫండ్స్లో పెట్టుబడులపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు రద్దు.
- భారత్ ఈక్విటీల్లో 35 శాతానికి కంటే తక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడికి అనుగుణంగా పన్నుశ్లాబ్ వర్తింపు.
- మూడేండ్ల కంటే ఎక్కువ కాలం డెట్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై రాబడులకు దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలుగా గుర్తింపు. ఈ లాభాలపై 20 శాతం పన్ను వడ్డింపు.
ఎస్సీఎస్సెస్.. పీఓఎంఐఎస్ల్లో గరిష్ట పెట్టుబడి పరిమితి పెంపు
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్సెస్), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం (పీవోఎంఐఎస్)ల్లో పెట్టుబడులకు గరిష్ట పరిమితి పెంపు.
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో పెట్టుబడులకు గరిష్ట పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు. 2023 జనవరి-మార్చి మధ్య 8 శాతం వడ్డీ హామీ. త్రైమాసికానికోసారి వడ్డీ చెల్లింపు.

- పాపులర్ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం (పీవోఎంఐఎస్) కింద గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంపు.
- పీవోఎంఐఎస్ కింద ఉమ్మడి ఖాతాలు నిర్వహించవచ్చు. ఉమ్మడి ఖాతాల్లో గరిష్ట పరిమితి రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు. జనవరి-మార్చి త్రైమాసికంలో 7.1 శాతం వడ్డీ చెల్లింపు.
- ఎస్సీఎస్సెస్, పీవోఎంఐఎస్ పథకాల గడువు ఐదేండ్లు. మెచ్యూరిటీ తర్వాత మరో మూడేండ్ల పాటు ఎస్సీఎస్సెస్ పొడిగించవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో విత్‌డ్రాయల్స్‌కు కొత్త నిబంధన
ఎన్పీఎస్ టైర్-1 ఖాతాలో ఐదేండ్ల డిపాజిట్ తరవాత.. అందులో 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
అనారోగ్య చికిత్స, వైకల్య సమస్యలకు, పిల్లల వివాహం లేదా ఉన్నత విద్యాభ్యాసం, ఆస్తుల కొనుగోళ్లు. మొత్తం ఎన్పీఎస్ టైర్-1 ఖాతా పెట్టుబడి కాలంలో గరిష్టంగా మూడు సార్లు నగదు విత్‌డ్రాకు అనుమతి.

మరోమారు వడ్డీరేట్ల పెంపు?
ఏప్రిల్ ఆరో తేదీన ఆర్బీఐ తొలి ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) ప్రకటన.
ఆందోళనకర స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు పెంచవచ్చునని నిపుణుల అంచనా.
2022-23లో 250 బేసిక్ పాయింట్ల పెంపుతో 6.50 శాతానికి చేరుకున్న ఆర్బీఐ రెపోరేట్.
రెపోరేట్ మళ్లీ పెంచితే, ఇండ్ల రుణాలు, ఇతర రుణాలపై వడ్డీరేట్లు పెరుగుదల.

హాల్‌మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి
- ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేవలం హాల్‌మార్క్ బంగారం ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేయాలి.
- ఆరు డిజిట్ల అల్ఫాన్యూమరిక్ కోడ్ నంబర్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ) ఉంటుంది.
- ప్రతి ఆభరణంపై హాల్‌మార్క్ తప్పనిసరి.
- బంగారం కొనుగోళ్లపై పారదర్శకతతోపాటు నిజ విలువ (స్వచ్ఛత) తెలుస్తుంది.

సేవింగ్స్ ఖాతాలపై టారిఫ్ పెంచిన యాక్సిస్ బ్యాంక్
- ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన సేవింగ్స్ అండ శాలరీ ఖాతాల టారిఫ్ పెంపు.
- ప్రిస్టీజ్ సేవింగ్స్ అకౌంట్లలో సగటు బ్యాలెన్స్ మొత్తం సవరణ.
- గతంలో సగటు త్రైమాసికం బ్యాలెన్స్‌గా ఉన్న రూ.75 వేలను నెలవారీ సగటు బ్యాలెన్స్‌గా ఖరారు.
- ఖాతాలో కనీస సగటు బ్యాలెన్స్ లేకపోతే చార్జీల సవరణ.
- జీరో బ్యాలెన్స్‌పై చార్జీలు రూ.50 నుంచి రూ.600 లకు పెంపు.
- ఆర్థికేతర కారణాలపై ఇన్వార్డ్ చెక్ రిటర్న్స్ చార్జీలు రూ.50 నుంచి రూ.150కి పెంపు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

