హైదరాబాద్, ఆగస్టు 7: చిన్న పిల్లల ఆసుపత్రుల సంస్థ రెయిన్బో చిల్డ్రన్ మెడ్కేర్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.41.49 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.38.79 కోట్ల లాభంతో పోలిస్తే ఏడు శాతం పెరిగింది. ఆదాయం 21 శాతం ఎగబాకి రూ.237.15 కోట్ల నుంచి రూ.287.10 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, హైదరాబాద్‌లో 60 పడకల ఆసుపత్రితోపాటు బెంగళూరులో 80 పడకలు, చెన్నైలో 80 పడకలతోపాటు హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రిలో 50 పడకలు జత చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతేడాది కొత్తగా 270 పడకలు జతకానున్నట్లు కంపెనీ సీఎండీ రమేశ్ కంచర్ల తెలిపారు.