Emergency Landing | ఫ్లయిట్లల్లో టెక్నికల్ సమస్యలు.. 48 గంటల్లో 3 ఎమర్జెన్సీ ల్యాండింగ్స్!
Emergency Landing | గత 48 గంటల్లో దేశవ్యాప్తంగా 3 అంతర్జాతీయ సంస్థల విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి.
Emergency Landing | ఇటీవలి కాలంలో వివిధ సంస్థల విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ నిత్యకృత్యంగా మారింది. గత 48 గంటల్లో మూడు అంతర్జాతీయ విమాన సర్వీసుల సంస్థల విమానాలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. శుక్ర, శనివారాల్లో కాలికట్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఘటనలు జరిగాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వివిధ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ విమానాల పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ఆశ్రయించారు.
షార్జా నుంచి కొచ్చిన్ బయలుదేరిన ఎయిర్ అరేబియా విమానం (జీ9-426)లో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తడంతో కాలికట్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన విమానాన్ని విమానాశ్రయ స్టాండ్‌కు తరలించారు.
శనివారం అడ్డిస్ అబాబా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన ఇథోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ప్రెషరైజేసన్ సమస్యతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ఆశ్రయించింది. అంతకుముందు శుక్రవారం హైడ్రాలిక్ సమస్య వల్ల శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం.. చెన్నైలో అత్యవసరంగా ల్యాండయింది.
శనివారం ఎయిర్ అరేబియా విమానం హైడ్రాలిక్ సమస్య వల్ల కొచ్చిన్‌లో, ఇథోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రెషరైజేషన్ ఇష్యూ వల్ల కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ఆశ్రయించాయని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. హైడ్రాలిక్ సమస్య తలెత్తడం వల్లే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసరంగా చెన్నైలో ల్యాండయిందని ఆ అధికారి చెప్పారు.
ఈ ఘటనలన్నింటిపై సవివరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్.. సాంకేతిక సమస్య తలెత్తడంతో కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండయిందని ఆ సంస్థ తెలిపింది. హైదరాబాదీ ప్రయాణికులను తరలించడానికి మరో విమానాన్ని కరాచీకి పంపినట్లు ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

