ముంబై, సెప్టెంబర్ 20: అంతర్జాతీయ కస్టమర్ సేవల సేవల సంస్థ (24)7.ఏఐ..భారీ స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 9 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. దేశీయంగా తన వ్యాపారానికి డిమాండ్ ఉండటంతో ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు చెందినవారిని తీసుకోనున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నైనా నాయర్ తెలిపారు. వీరికి ఎక్కడి నుంచైనా పనిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.