Budget 2023-24 | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరో రెండు పేజీలు చదవడం ఉండగానే.. 86 నిమిషాల్లో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ బడ్జెట్లోని 23 ముఖ్య అంశాలపై ఓ కన్నేద్దాం.
1. ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు.
2. ఎలక్ట్రిక్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్, కంట్రీ మొబైల్స్ చౌకగా ఉంటాయి. కెమెరా లెన్స్, లిథియం అయాన్ బ్యాటరీ, ఎల్ఈడీ టీవీలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ గేమ్స్ చౌక కానున్నాయి. జీఎస్టీ నుంచి బ్లెండెడ్ సీఎన్జీ బయటపడింది. ధర కూడా తగ్గుతుంది. బయోగ్యాస్‌కు సంబంధించిన వస్తువులు చౌకగా ఉంటాయి.
3. చిమ్నీ, సిగరెట్, బంగారం, వెండి, ప్లాటినం వంటివి ధర పెరుగుతాయి. విదేశాల నుంచి తెచ్చే వెండి వస్తువులు కూడా ఖరీదవుతాయి.
4. యువత కోసం ‘పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్’ ప్రారంభించనున్నారు. దీని కింద మూడేండ్ల పాటు భత్యం ఇస్తారు.
5. రానున్న మూడేండ్ల కాలంలో 740 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించనున్నారు.
6. 2014 నుంచి నిర్మిస్తున్న 157 మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.
7. మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం తీసుకొచ్చారు. దీని కింద 2 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. 7.5% వడ్డీ లభిస్తుంది.
8. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.5 నుంచి 8 శాతానికి పెంచారు. ఈ పథకంలో పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.
9. మురుగు కాలువల శుభ్రతలో మాన్యువల్ క్లీనింగ్‌కు బదులుగా యంత్రాలతో శుభ్రపరచడాన్ని ప్రోత్సహించనుననారు. మ్యాన్‌హోల్‌కు బదులుగా మెషిన్ హోల్‌పై దృష్టి సారిస్తారు.
10. పాన్ కార్డు ఇప్పుడు జాతీయ గుర్తింపు కార్డుగా మారింది. ఇప్పటి వరకు కేవలం ఇన్‌కం ఫైలింగ్‌కు పాన్ కార్డును ఉపయోగించేవారు. దీనితో కేవైసీ ప్రక్రియ సులభం అవనున్నది.
11. ‘శ్రీ అన్న’ అనగా ముతక ధాన్యాలను ప్రోత్సహిస్తారు. ముతక ధాన్యాల కోసం పరిశోధనా సంస్థ తెరవనున్నారు. శ్రీ అన్న యోజన కింద ముతక ధాన్యాల వినియోగం, ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు.
12. పీఎం ఆవాస్ యోజన బడ్జెట్ 66 శాతం పెరిగింది. దీని కింద రూ.79,000 కోట్లు కేటాయించారు.
13. వ్యవసాయ రంగానికి సంబంధించిన స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నారు. యువ పారిశ్రామికవేత్తల అగ్రి-స్టార్టప్‌ల కోసం అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ సృష్టించనున్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కోటి మంది రైతులకు సాయం అందించనున్నారు. ఇందుకోసం 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
14. వ్యవసాయంలో క్లస్టర్ సిస్టంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నారు. పీఎం ఫిషరీస్ స్కీం కోసం రూ.6,000 కోట్లు ప్లాన్ చేశారు.
15. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు నిర్మించనుననారు.
16. పిల్లలు, యువత కోసం అన్ని భాషల పుస్తకాలు లభించేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు.
17. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ‘యూనిఫైడ్ స్కిల్ ఇండియా డిజిటల్ ప్రోగ్రాం’ కింద దేశంలో 30 స్కిల్ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేసి యువత శిక్షణ ఇవ్వనున్నారు.
18. 5జీ యాప్‌లు, సేవల అభివృద్ధి కోసం 100 ల్యాబ్‌లను తయారు చేయనున్నట్లు ప్రకటించారు.
19. రైల్వేల అభివృద్ధికి రూ.2.4 లక్షల కోట్లు కేటాయించారు. కొత్త రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు.
20. జైళ్లలో ఉన్న పేద ఖైదీల బెయిల్, వారికి విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించడంలో ప్రభుత్వం సహాయం చేస్తుంది. బెయిల్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
21. గోబర్ధన్ పథకం కింద రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. 5 శాతం కంప్రెస్డ్ బయోగ్యాస్ తప్పనిసరి చేశారు.
22. అమృత్ ధరోహర్ పథకం కింద రామ్సర్ సైట్, జీవవైవిధ్య పరిరక్షణ, ఎకో టూరిజంను ప్రోత్సహిస్తామన్నారు. దేశంలో 75 రామ్సర్ సైట్లు ఉన్నాయి.
23. కొవిడ్ సమయంలో ఇబ్బంది పడిన చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.2 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం తీసుకువస్తామని చెప్పారు. 5 శాతం కంటే తక్కువ నగదు ఉన్న ఎంఎస్ఎంఈలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 3.7 లక్షల ఎంఎస్ఎంఈలకు ఉపశమనం లభించనున్నది.