Mercedes-Benz V-Class | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ – బెంజ్.. గ్లోబల్లీ న్యూ ‘వీ క్లాస్’ కారు ఆవిష్కరించింది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, డ్రైవర్ అసిస్టెన్స్ తోపాటు పలు కొత్త ఫీచర్లతో రూపుదిద్దుకున్న వీ-క్లాస్, వీ-క్లాస్ మార్కో పోలో, వీ-క్లాస్ ఈక్యూవీ, వీ-క్లాస్ విటో, వీ-క్లాస్ ఈవిటో అనే పేర్లతో వీ-క్లాస్ ఫేస్ లిఫ్ట్ కార్లు ఆవిష్కరిస్తున్నది.
సుదీర్ఘ విరామం తర్వాత న్యూ వీ-క్లాస్ శ్రేణి కార్లు ప్రధానమార్పులతో వస్తున్నాయి. వీ- క్లాస్ లైన్అప్తోపాటు రెండు ఎం-గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ గ్రూపులో వీ-క్లాస్, వీ-క్లాస్ మార్కోపోలో, ఈక్యూవీ, రెండో గ్రూపులో విటో, ఈవీటో మోడల్ కార్లు వస్తున్నాయి. వీటో, ఈవీటో వేరియంట్లు వేర్వేరు అప్డేట్స్తో వస్తున్నాయి.
ఈక్యూవీ వేరియంట్ అవాంట్ గార్డెలైన్, వీ క్లాస్ నాలుగు వేరియంట్లు – ఎంట్రీ లెవల్, స్టైల్, అవాంట్ గార్డెలైన్, ఎక్స్ క్లూజివ్ లగ్జరీ లైన్ ఆప్షన్లలో లభిస్తాయి. వీ -క్లాస్ వేరియంట్ కార్లు ఎఎంజీ లైన్, నైట్ ప్యాకేజీ అదనంగా ఆప్షనల్ డిజైన్ ప్యాకేజీలుగా ఉన్నాయి. స్లీపింగ్ బెడ్, కిచెన్ టాప్, పాప్అప్ రూఫ్, రీ డిజైన్డ్ ఫ్రంట్ ఫేషియా, విత్ ఏ బిగ్గర్ గ్రిల్లె, స్లీక్ హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్డ్ లోయర్ బంపర్ విత్ న్యూలీ డిజైన్డ్ బిగ్గర్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రేర్‌లో టెయిల్ గేట్, లోయర్ బంపర్, గ్లాస్ ఏరియా అప్ డేట్ చేసింది.
ఇంటీరియర్‌గా న్యూ డాష్ బోర్డ్ లే ఔట్ విత్ అడ్వాన్స్డ్ ఫీచర్లతోపాటు ఈక్యూవీ, వీ క్లాస్, వీ-క్లాస్ మార్కో పోలో కార్లు ట్విన్ వైడ్ స్క్రీన్ డిస్ ప్లేలు, యాంబియెంట్ లైటింగ్, కనెక్ట్ టెక్, ఆటో ఐఆర్వీఎం, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ చార్జిగ్, డ్యుయల్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు జత కలిశాయి.
డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ విత్ అటెన్షన్ అసిస్ట్, హెడ్ ల్యాంప్ అసిస్ట్, రెయిన్ సెన్సర్, యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్, డిస్ట్రోనిక్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ విత్ క్రాస్ ట్రాఫిక్ ఫంక్షన్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్, పార్క్ ప్యాకేజీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
విటో, ఈవీటో వేరియంట్ కార్లు స్మాలర్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రిఫ్లెక్టర్ హెడ్ లైట్స్, బ్లాక్ బంపర్స్, హై ఎండ్ ట్రిమ్స్ వేరియంట్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పొందుతాయి.
మెర్సిడెజ్-బెంజ్ వీ-క్లాస్ కార్లు పెట్రోల్ అండ్, టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతోపాటు మైల్డ్ అండ్ స్ట్రాండ్ హైబ్రీడ్ సిస్టమ్స్ కలిగి ఉంటాయి. ఆల్ ఎలక్ట్రిక్ ఈక్యూవీ కారు 90కిలోవాట్ల బ్యాటరీ విత్ ట్విన్ ఎలక్ట్రిక్ మోటార్స్ కలిగి ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జింగయితే 450-500 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్లలో న్యూ వీ-క్లాస్ కార్లను మెర్సిడెజ్ -బెంజ్ ఆవిష్కరించే అవకాశం ఉన్నది.