2023 Kia Seltos facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన అప్డేటెడ్ ఎస్యూవీ సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్ శుక్రవారం (జూలై 14) నుంచి ప్రారంభం అవుతాయి. సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కార్లు సొంతం చేసుకోవాలని భావించే వారు కంపెనీ వెబ్ సైట్ ద్వారా గానీ, డీలర్ల వద్ద గాని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కస్టమర్లు త్వరితగతిన కారు డెలివరీ అందుకునేందుకు కియా మోటార్స్.. కే-కోడ్ ఇన్సియేటివ్ (K-Code intiative) ప్రవేశ పెట్టింది. సెల్టోస్ ఓనర్లకు సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ డెలివరీ అధిక ప్రాధాన్యం కల్పిస్తారు.
కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ 18 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.22 లక్షల మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, న్యూ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, న్యూ సీక్వెన్సియల్ ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రీ డిజైన్డ్ ఎల్ఈడీ గైడ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 18-అంగుళాల క్రిస్టల్ కట్ గ్లోసీ బ్లాక్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు జత చేశారు.