గురువారం 04 జూన్ 2020
Business - Apr 10, 2020 , 11:56:28

కరోనా దెబ్బ 2008 మాంద్యంకన్నా తీవ్రమైనది

కరోనా దెబ్బ 2008 మాంద్యంకన్నా తీవ్రమైనది

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మహా విపత్తు వల్ల దాదాపు 50కోట్లమంది పేరదరికంలోకి జారుకోనున్నారని నైరోబీ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్స్‌ఫామ్‌ అనే స్వచ్చంద సంస్థ అంచనావేసింది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు వచ్చేవారం  అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ప్రపంచబ్యాంకు సమావేశం కానున్న నేపథ్యంలో ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను విడుదల చేసింది. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధికమాంద్యంకంటే కరోనా సంక్షోభం ఎంతో తీవ్రంగా ఉండదనుందని ఆ సంస్థ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పేదలు 1990 నాటికంటే ఎక్కువమంది తయారవుతారని, కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మూడు దశాబ్దాలు వెనక్కు పోనున్నాయని హెచ్చరించింది. పేదరిక అంచనాకోసం ప్రపంచబ్యాంకు ఉపయోగించే లేక్కలనే ఈ సంస్త కూడా తన రిపోర్టు రూపకల్పనలో ఉపయోగించింది. ఒక వ్యక్తి రోజుకు 1.90 అమెరికన్‌ డాలర్లకంటే ఎ్కువ సంపాదిస్తే తీవ్రమైన పేదలుగా, అదేవిధంగా రోజుకు 5.50 డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తే సాధారణ పేదలుగా భావిస్తారు. ప్రస్తుతం అత్యంత పేదలు ప్రపంచంలో 43.4కోట్లమంది ఉన్నారని, వారి సంఖ్య 120కోట్లకు పెరుగనుందని ఆక్స్‌ఫామ్‌ అంచనావేసింది.   


logo