ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 20, 2020 , 01:06:04

శాంతిస్తున్న ఇంధన ధరలు

శాంతిస్తున్న ఇంధన ధరలు
  • 19 పైసల వరకు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌

న్యూఢిల్లీ, జనవరి 19: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ఇంధన ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతుండటంతో దేశీయంగా ఇంధన ధరలను వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా తగ్గించాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. లీటర్‌ పెట్రోల్‌ ధరను 17 పైసల నుంచి 19 పైసల వరకు తగ్గించిన సంస్థలు.. డీజిల్‌ను 16 నుంచి 18 పైసలు కోత విధించాయి. 

దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75.09కి దిగిరాగా, ముంబైలో రూ.80.68కి, కోల్‌కతాలో రూ.77.68కి, చెన్నైలో రూ. 78.01కి తగ్గాయి. హైదరాబాద్‌ లీటర్‌ పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గడంతో రూ.79.85కి దిగొచ్చింది. అలాగే ఢిల్లీలో రూ.68.45కి తగ్గిన డీజిల్‌ ధర, ముంబైలో రూ.71.77కి, కోల్‌కతాలో రూ.70.81కి, చెన్నైలో రూ. 72.33కి దిగొచ్చాయి. ఈ ధరలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు తెలిసింది. హైదరాబాద్‌లో డీజిల్‌ రూ.74.63గా నమోదైంది. వరుసగా ఐదు రోజుల్లో పెట్రోల్‌ 64 పైసల వరకు తగ్గగా, డీజిల్‌ 67 పైసలు చౌకైంది.


logo