మంగళవారం 07 ఏప్రిల్ 2020
Business - Jan 12, 2020 , 01:21:29

యూనివర్సల్‌ లైసెన్సుకు ‘చైతన్య’ దరఖాస్తు

యూనివర్సల్‌ లైసెన్సుకు ‘చైతన్య’ దరఖాస్తు

న్యూఢిల్లీ, జనవరి 11: సూక్ష్మరుణ సంస్థ ‘చైతన్య ఇం డియా ఫిన్‌ క్రెడి ట్‌'.. యూనివర్స ల్‌ బ్యాంక్‌ లైసెన్సు కోసం రిజర్వు బ్యాంకుకు దరఖా స్తు చేసింది. ప్రము ఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌' సహ వ్యవస్థాపకుడైన సచిన్‌ బన్సల్‌ నాలుగు నెలల క్రితం ఈ సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేశా రు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన రూ.739 కోట్ల పెట్టుబడులతో ఈ సంస్థను కైవసం చేసుకొన్నాడు. బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించేవారి విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆర్బీఐ గతంలోనే యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘చైతన్య’కు ఈ లైసెన్సు ఇస్తే పశ్చిమ బెంగాల్‌పై దృష్టిసారించిన బంధన్‌ బ్యాంకు తర్వాత యూనివర్సల్‌ లైసెన్సును పొందిన సూక్ష్మరుణ సంస్థల్లో రెండవదిగా నిలుస్తుంది. 2009లో ఏర్పాటైన ‘చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌' కర్ణాటక, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, జార్ఖం డ్‌ రాష్ర్టాల్లో 40 శాఖలను నడుపుతున్నది.


logo