హైదరాబాద్, డిసెంబర్ 23: పాత వాహనాలపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన శ్రీరాం ఫైనాన్స్ తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో 10 వేల మంది సిబ్బంది ఉండగా, వచ్చే ఏడాదిలోగా మరో 2 వేల మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో వైస్ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో 498 శాఖలు, 25 లక్షల ద్విచక్ర వాహన వినియోగదారులు 1.80 లక్షల కమర్షియల్ కస్టమర్లు ఉన్నారు.
దేశవ్యాప్తంగా 2,875 శాఖలు ఉండగా, వీటితోపాటు 750 సర్విసింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సర్విసింగ్ సెంటర్లను కూడా శాఖలుగా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 250 శాఖలను మార్చాలనుకుంటున్నట్లు తెలిఎపారు.
శ్రీరాం ఫైనాన్స్‌కు తెలుగు రాష్ర్టాలు పుట్టినిల్లుగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో రూ.33 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు చక్రవర్తి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం, ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లు ఆశించిన స్థాయి కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.