న్యూఢిల్లీ, ఆగస్టు 14: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ..భారత్‌కు శుభవార్తను అందించింది. 18 ఏండ్ల తర్వాత భారత్‌కు ‘బీబీబీ’ రేటింగ్‌ను ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. గతేడాది నిలకడ నుంచి పాజిటివ్ రేటింగ్ ఇచ్చిన ఎస్అండ్పీ..ఈసారి ఏకంగా బీబీబీని అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకట్టుకోవడానికి ఈ రేటింగ్ ఎంతో కీలకంగా మారుతున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ దేశాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో దేశం సరాసరిగా 8.8 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే రేటింగ్‌ను సవరించినట్టు పేర్కొంది. మరోవైపు, 2025-26లో భారత్ 6.5 శాతం వృద్ధిని సాధించనున్నదని అంచనాలో పేర్కొంది.