హైదరాబాద్, ఆగస్టు 18: హైదరాబాద్కు చెందిన శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఎస్ఎంఈ ప్లాట్ఫాం కింద ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. సంస్థ జారీ చేసిన షేరు ధర కంటే 153.69 శాతం పెరిగి రూ.106.55 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచే దూకుడు101.50 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు ఒక దశలో రూ.106.55 గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ రాథి నారాయణ్ దాస్ మాట్లాడుతూ..
ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు, ఈ ఏడాది చివరినాటికి దక్షిణాదిలోని అన్ని రాష్ర్టాలకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం కంపెనీలో వెయ్యి మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారని, వచ్చే రెండేండ్లలో మరో 2 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన రావడంతో కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 418.48 రెట్లు అధికంగా బిడ్డింగ్లు వచ్చాయి. ఈ ఐపీవో ద్వారా రూ.2,699.54 కోట్ల నిధులను సేకరించింది.