న్యూఢిల్లీ, జూన్ 6: ఈ ఏడాదికిగాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) గురువారం ప్రకటించిన టెక్నాలజీ పయనీర్స్ జాబితాలో భారత్ నుంచి 10 స్టార్టప్‌లకు చోటు దక్కింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన నెక్స్ వేవ్ కూడా ఉన్నది.
మొత్తం 100 ప్రముఖ స్టార్టప్‌లతో ఈ లిస్టు విడుదలైంది. కాగా, భారతీయ స్టార్టప్‌లలో పిక్సెల్, నిరమై, సర్వం ఏఐ, ఆంపేర్అవర్, క్రోపిన్, హెల్త్‌ప్లిక్స్, ఎంట్రీ, ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ, స్ట్రింగ్ బయో ఉన్నాయి.