న్యూఢిల్లీ, మే 27: బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.3,300 తగ్గి రూ.2,69,700గా నమోదైంంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు అతి విలువైన లోహాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1.03 శాతం తగ్గి 4,461 డాలర్లకు పడిపోగా, వెండి కూడా మూడు శాతం తగ్గి 74.96 వద్దకు పడిపోయింది.