న్యూఢిల్లీ, మే 27: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్తగా ఓటీటీ పాస్‌ను ఆవిష్కరించింది. 28 రోజుల కాలపరిమితితో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లో అనుసంధానం, జియో టీవీల్లో వెయ్యికి పైగా లైవ్ టీవీ చానెళ్లు, 30 జీబీ అత్యంత వేగవంతమైన డాటా అందిస్తున్నది.ఈ కొత్త పాస్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్స్ అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రూ.1,500 ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.