వేసవిలో అందాన్ని కాపాడుకోవడం.. కొంచెం కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే, బయటినుంచి ఎన్ని క్రీములు రాసినా, ఎంత మెరుగులు దిద్దినా మండే ఎండల్లో వ్యర్థమే అవుతుంది. సరైన ఆహారం తీసుకున్నప్పుడే.. వన్నె తగ్గని అందం సొంతమవుతుంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణలో కొన్ని ముఖ్యమైన అంశాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
హైడ్రేషన్: వేసవిలో చర్మం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే.. అవకాడో, పుచ్చకాయలు, దోసకాయలు, స్వీట్ పొటాటో, టమాటా, గ్రీన్ టీ.. తీసుకోవడం మంచిది. అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు.. శరీరానికి మరింత శక్తినిస్తాయి. ఇందులోని యాంటి ఏజింగ్ లక్షణాలు.. చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. స్వీట్ పొటాటో.. నేచురల్ సన్‌బ్లాక్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే బీటా కెరోటిన్.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలు, దోసకాయలు అధిక శాతం నీటితో నిండి ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంతోపాటు ఇన్ఫ్లమేషన్, చికాకును తగ్గిస్తాయి. వడదెబ్బ వల్ల కలిగే నొప్పిని నివారిస్తాయి.
విటమిన్లు: వేసవిలో దెబ్బతిన్న చర్మం మళ్లీ మెరుగ్గా మారాలంటే.. ఆహారంలో విటమిన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. కొలాజెన్ ఉత్పత్తి కోసం ఆహారంలో విటమిన్ సి ఉండాలి. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, గీతలు తగ్గించడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటుంది. కేల్ ఆకుకూర.. వేసవిలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని సలాడ్, సూప్‌లో తీసుకోవడం ద్వారా.. ఇందులోని విటమిన్లన్నిటినీ శరీరానికి అందించవచ్చు. ఇక గ్రీన్ టీలో ఉండే శక్తిమంతమైన ఫ్లేవనాయిడ్స్.. చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. చర్మం ఎక్కువగా సాగకుండా నిరోధించడంతోపాటు ముడతలు పడకుండా చూస్తాయి.
ఉల్లి వెల్లుల్లి కలిపి తింటే..వంటింట్లో ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటాయి. దాదాపుగా అన్ని రకాల ఆహారాల్లో వీటిని వాడుతూ ఉంటారు.