రోజూ ఎన్నో ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ట్రెండింగ్లో ఉంటున్నాయి. వాటిలో ‘బిట్వీన్ ద ఫింగర్’ ఉంగరం యువతను బాగా ఆకట్టు కుంటున్నది. ఉంగరం ఒకటే, కానీ రెండు వేళ్లకూ దీన్ని ముస్తాబు చేసుకోవచ్చు. డబుల్ ధమాకా ఆఫర్.. అన్నమాట. ఇందులో పూలు, సీతాకోకచిలుకలు, ఆకులు, హృదయం.. మొదలైన డిజైన్లు భలే అందంగా ఉన్నాయి. బంగారమే కాకుండా వెండి, ప్లాటినం ఉంగరాలూ లభిస్తున్నాయి. రంగురాళ్లు, వజ్రాలు, కెంపులతో ముస్తాబై ఆభరణ ప్రియులను ఊరిస్తున్నాయి. ఓ అంతర్జాతీయ ఆభరణ బ్రాండ్ వీటిని తీసుకొచ్చింది. ధర లక్షల్లోనే ఉంటుంది.