ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత తెలిసిందే. అయితే ఉల్లి ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. కోస్తుంటే కండ్లు మండుతాయి కానీ, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో నేత్రవైద్యుడి కంటే ముందు ఉంటుంది. ఉల్లిపాయ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు.
2/5
ఉల్లిపాయలోని యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలకు చెక్ పెడతాయి. మచ్చలను తొలగిస్తాయి. ఉల్లిపాయ రసంలో ఆలివ్ ఆయిల్ కలిపి ఫేస్‌ప్యాక్ వేసి చూడండి. మీ ముఖంలో నిగారింపు వస్తుంది.
3/5
ఉల్లిపాయకు పిగ్మెంటేషన్‌ను తొలగించే ఔషధ గుణాలున్నాయి. పసుపులో ఉల్లిపాయ రసాన్ని కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. శనగపిండి, ఉల్లిరసం, పాలు .. మూడూ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా ముఖానికి రాసుకుని.. కాసేపటి తర్వాత కడిగితే మొహం చంద్రబింబమే.
4/5
అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని ఉల్లి తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల వల్ల కలిగే హానిని అడ్డుకుంటాయి.
5/5
పెదాల నిగారింపునకు ఉల్లి బాగా పనిచేస్తుంది. ఎండిపోయిన పెదాలకు ఉల్లిరసం పూస్తే చాలు.
6/5
ఉల్లిపాయ కోస్తుంటే కండ్లు మండుతాయి. కానీ, కంటి సమస్యలను నివారించడంలో ఉల్లి ఔషధ గుణాలకు సాటిలేదు. నేత్ర సమస్యలకు చెక్ పెట్టాలంటే మీ డైట్లో ఉల్లి ఉండాల్సిందే.