Monsoon | వానాకాలంలో మొటిమలు అవుతున్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
Monsoon | వానకాలంలో చిరుజల్లులు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, వాతావరణంలో తేమ పెరగడంతో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొడిబారుతుంది. మొహానికి మొటిమలు పుట్టుకొస్తాయి. చర్మం దురదగా ఉంటుంది. వీటన్నిటి నుంచి ముఖారవిందాన్ని కాపాడు కోవడానికి సంప్రదాయ చిట్కాలు...
Monsoon | వానకాలంలో చిరుజల్లులు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, వాతావరణంలో తేమ పెరగడంతో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొడిబారుతుంది. మొహానికి మొటిమలు పుట్టుకొస్తాయి. చర్మం దురదగా ఉంటుంది. వీటన్నిటి నుంచి ముఖారవిందాన్ని కాపాడు కోవడానికి సంప్రదాయ చిట్కాలు…
పాలు-తేనె ఫేస్‌వాష్
ఒక టేబుల్ స్పూన్ తేనెను రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమానంగా ముఖానికి రాసుకోవాలి. రెండుమూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఇది చర్మాన్ని కాంతిమంతం చేసి, ముఖం మీదున్న జిడ్డును వదలగొడుతుంది.
కోల్డ్ కుకుంబర్ ఫేస్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు (జెల్) లేదా జ్యూస్‌ను పావుభాగం తురిమిన కీర దోసతో కలుపుకోవాలి. దీనిని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. కలబందలోని ప్రాకృతిక గుణాలు, దోసలోని చల్లదనం రెండూ కలిసి చర్మానికి కొత్త శక్తినిస్తాయి. హైడ్రేట్ చేస్తాయి.
ఓట్స్-లెంటిల్స్ మిశ్రమం
సగం కప్పు ఓట్స్ పిండి, ఒక కప్పు సున్నిపిండి (లెంటిల్స్ పౌడర్), పావుకప్పు బియ్యపు పిండి, 9 బాదం పప్పులు (నూరుకోవాలి), చిటికెడు పసుపు మిశ్రమాన్ని రోజ్‌వాటర్‌తో కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం మీద పేరుకుపోయిన మలినాలను, ఎక్కువైన నూనెను తొలగిస్తుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- Acne
- beauty tips
- Monsoon
- Skincare
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

