కాకర కాయ పేస్టులో కాసింత అలోవేరా జ్యూస్, పసుపు కలిపి ముందుగా ఓ మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దాన్ని శరీరంపై దురద ఉన్న చోట అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.
2/6
కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. అందం పెంచుకోవడంలోనూ అంతే సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో కాకరకాయను ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మానికి నిగారింపు వచ్చేలా చేయొచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
3/6
కాకరకాయను రసంలా చేసి ముఖానికి రాయాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. రెగ్యులర్‌గా ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా మారుతుంది.
4/6
కాకరకాయను పేస్ట్‌లో చేసి కరివేపాకు పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల సమస్య తగ్గుతుంది.
5/6
కాకరకాయను పేస్ట్‌లో చేసి కరివేపాకు పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మొటిమల సమస్య తగ్గుతుంది.
6/6
కాకరకాయ పేస్ట్‌లో జాజికాయ పొడి, పెరుగు కలిపి మిశ్రమంగా మార్చుకోవాలి. ఆ దాన్ని ముఖంపై ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం ద్వారా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.
7/6
కాకర కాయ ముక్కలను నీటిలో మరిగించాలి. ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎలాంటి మచ్చలైనా దూరమవుతాయి.