కాబోయే అమ్మకు మేకప్?
గర్భిణులు మేకప్ వేసుకోవడం అంత మంచిది కాదని విన్నాను. నిజమేనా? మొటిమల్లాంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఏం చేయాలి? ప్రత్యేకించి ఎలాంటి లేపనాలు, మందులు వాడకూడదో వివరంగా చెప్పండి.
గర్భిణులు మేకప్ వేసుకోవడం అంత మంచిది కాదని విన్నాను. నిజమేనా? మొటిమల్లాంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఏం చేయాలి? ప్రత్యేకించి ఎలాంటి లేపనాలు, మందులు వాడకూడదో వివరంగా చెప్పండి.
- ఓ పాఠకురాలు
కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఉపయోగించే లేపనాలు బిడ్డ మీద కూడా చెడు ప్రభావం చూపిస్తాయి. అలాగే మందులనూ జాగ్రత్తగా వాడాలి. మీరు అడిగినట్టు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి మేకప్‌లు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆయా క్రీముల్లో ఎలాంటి రసాయనాలు వాడారన్నది అంత స్పష్టంగా తెలియదు. ఉదాహరణకు.. మొటిమల నివారణకు వాడే క్రీములు, మాత్రల్లో ఐసో ట్రెటినాయిన్ అనే మందు ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కనుక తీసుకుంటే.. కడుపులోని పిల్లలకు అవకరాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ మందులు వాడేవారు.. కనీసం మూడు నుంచి ఆరు నెలల విరామం తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా తొలి మూడు నెలలూ వాడే మందులు, లేపనాలు బిడ్డకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కడుపుతో ఉన్నప్పుడు ఏ చర్మ సమస్యతోనో డెర్మటాలజిస్టు దగ్గరికి వెళితే మీరు గర్భిణి అనే విషయం తప్పకుండా చెప్పాలి.
అప్పుడే సురక్షితమైన మందులు రాయగలరు. అలాగే జలుబు చేసిందనో, జ్వరమనో… ఇష్టమొచ్చినట్టు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. నొప్పి మాత్రల ప్రభావం కడుపులోని బిడ్డ కిడ్నీల మీద పడుతుంది. అంటే, కిడ్నీలు సరిగ్గా వడపోయలేవు. అలాంటప్పుడు మూత్రానికి వెళ్లడం తగ్గిపోతుంది. దానివల్ల కడుపులోని పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు తగ్గిపోతుంది. ఎందుకంటే, మూత్రం కూడా ఉమ్మనీరులో భాగమే. దీనివల్ల బిడ్డ ప్రాణానికి ప్రమాదం కలిగే ముప్పు ఉంది. అందుకే, గర్భిణిగా ఉన్నప్పుడు వాడే సబ్బు నుంచి వేసుకునే మాత్రల దాకా అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒకవేళ ఏదైనా తప్పనిసరి అనుకుంటే డాక్టరును సంప్రదించి మాత్రమే వాడాలి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

