HomeBeauty-tipsHow To Treat Dandruff Here Is Some Home Remedies For Strong And Healthy Hair
Dandruff | డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే..
ఉదయం లేచింది మొదలు దుమ్ము, ధూళి, కాలుష్యానికి ఇబ్బందులు పడుతూ ఉంటాం. వీటితో పాటు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు కూడా జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాలు. తీసుకునే ఆహారంలో సమతుల్యత లేకపోవడంతో జుట్టు బలహీనపడుతుంది.. డాండ్రఫ్ వల్ల క్రమంగా కుదుళ్లు దెబ్బతిని ఊడిపోతుంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జీవం పోయిన జుట్టును తిరిగి కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
2/5
డాండ్రఫ్ సమస్య అధికంగా ఉన్నవారు కొబ్బరినూనె, వేపనూనెలను కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీంతో జుట్టుకు తగిన పోషణ అందడంతో పాటు వెంట్రుకలు మెత్తగా తయారవుతాయి. ఒత్తుగా పెరుగుతాయి.
3/5
కొబ్బరినూనెలో నిమ్మకాయ పిండి గోరువెచ్చగా చేసి మాడుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
4/5
కొందరు తలస్నానం చేశాక జుట్టు పూర్తిగా ఆరకముందే హెయిర్ డ్రయర్లు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు క్రమంగా బలహీనపడుతుంది.
5/5
పుల్లటి పెరుగును తలకు పట్టించి గంట సేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుపై పోరాడతాయి. జుట్టుకు తగిన బలాన్ని ఇస్తాయి.
6/5
కొందరి జుట్టు నిర్జీవంగా పాలిపోయినట్లు ఉంటుంది. దీని నుంచి విముక్తి కలగాలంటే తరచూ చల్లదనాన్నిచ్చే నూనెను తలకు రాస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలపడి రక్త ప్రసరణ జరిగి చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. దుమ్ము, ధూళి నుంచి. సూర్యుడి నుంచి ప్రసరించే అల్ట్రావైలెట్ కిరణాల నుంచి జుట్టును సంరక్షిస్తుంది.