Apps:
Follow us on:

Dark Circles | కండ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా దూరం చేసుకోండి

1/6చాలామంది ముఖం చూడకుండా కండ్లతోనే మాట్లాడుకుంటారు. మరి అలాంటి కళ్లు ఉబ్బినట్లుగా, నలుపుగా ఉంటే చూడడానికి బాగుంటుందా? వీటిని నివారించడానికి కొన్ని పద్ధతులున్నాయి.
2/6కొన్ని బాదంపప్పులను బాగా నానబెట్టి మెత్తని పేస్టులా చేయాలి. అందులో కొంచెం పాలు కలిపి రాత్రిపడుకనే ముందు కంటి చుట్టూ రాసుకోవాలి. నిద్ర లేవగానే చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
3/6అధిక ఒత్తిడి, అలసట వల్ల కండ్ల కింద వాచినట్లు అవుతుంది. అది పోవాలంటే.. వాడిన గ్రీన్ టీ బ్యాగులను చల్లటి నీటిలో ముంచి కంటి కింద వాపు ప్రాంతంలో పెట్టుకుంటే తగ్గుతుంది.
4/6వీటన్నింటికంటే మనిషికి సరిపడినంత అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. దీంతోపాటు పోషకాహారం తీసుకుంటే కండ్లు మిలమిలా మెరుస్తాయి.
5/6కీరదోస రసం కండ్లకి చాలా మంచిది. అది చర్మానికి మంచి టోనర్‌గా కూడా పనిచేస్తుంది. కీరదోస రసంలో దూది ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. కొంచెం రసాన్ని కండ్ల కింద భాగంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కండ్ల్లు అందంగా మారుతాయి.
6/6టమాటా గుజ్జు, నిమ్మరసం, శనగపిండి, పసుపు బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని కండ్ల చుట్టూ బాగా రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకి ఒకసారైనా ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు త్వరగా తగ్గుతాయి.