Hair fall remedies | జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి
Hair fall remedies | ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. కానీ ప్రస్తుత లైఫ్‌స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.
Hair fall remedies | ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. కానీ ప్రస్తుత లైఫ్‌స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. దీనివల్ల చాలామంది నెత్తి పల్చబడటంతో పాటు బట్టతల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. అవేంటంటే..
కొంత ఆవాల నూనెను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. కాస్త వేడిచేయాలి. వేడి అవగానే ఆవాల నూనెకు ఉసిరి ముక్కలు, మెంతి విత్తనాలను కలిపి, చెంచాతో బాగా కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లబరిచి, వెంట్రుకల మొదళ్లకు అప్లై చేసి, రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. మరుసటి రోజు గాఢతలు తక్కువున్న షాంపూతో కడగాలి.
జుట్టును కత్తిరించడం మానేస్తే వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది. వెంట్రుకల కొనలు తెగడానికి కారణం కూడా ఇదే.
వెంట్రుకలకు కలర్, రీ బాండింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. ఇలాంటి రసాయనాలతో కూడిన ఉత్పత్తుల్ని వాడితే జుట్టు ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసిన వారవుతారు. జుట్టు కండిషన్లో ఉంచుతూ ప్రతిరోజూ కడగాలి. జుట్టు పొడిగా మారడం వల్ల పొలుసులుగా మారి, పెరగడం ఆగిపోతుంది.
పడుకునే ముందు జుట్టును ముడివేయాలి. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు రోజూ షాంపూ పెట్టుకుంటే మంచిది కాదు. ప్రతి 15 రోజులకు ఒకసారి హెన్నా లేదా గోరింటాకుతో చేసిన హెయిర్ ప్యాక్‌ను వాడాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు నెరవకుండా ఉంటుంది. తెల్లబడిన జుట్టు నల్లగా మారడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
Read More :
“జుట్టు రాలే సమస్యలకు ఈ ఆయిల్‌తో చెక్.. బామ్మ, తాతల చిట్కా అదుర్స్”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

