Apps:
Follow us on:

Hairfall | రోజూ తలస్నానం చేస్తే జుట్టు పలచబడుతుందా?

1/6కొందరు ప్రతి రోజూ తలస్నానం చేస్తుంటారు. ఇంకొందరు వారానికోసారి కూడా చేయరు. అయితే తలస్నానం జుట్టును బట్టి కూడా తలస్నానం చేయాల్సి ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.
2/6ఆయిలీ హెయిర్ ఉండేవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తలస్నానం చేసిన ప్రతి సారీ జుట్టుకు కొంత సిరం, నూనెను అప్లై చేయాలి. ఇలా చేస్తే క్రమంగా జుట్టుకు పోషణ అందుతుంది.
3/6పొడిబారిన జుట్టు ఉన్నదంటే జుట్టుకు అవసరమైన తేమ లోపించిందని అర్థం. షాంపూతో జుట్టును తరచూ శుభ్రం చేసుకోవడం కారణంగా జుట్టు మరింత తేమను కోల్పోతుంది. పొడి జుట్టు ఉన్నవారు వారంలో రెండుసార్లు 2 నుంచి మూడు రోజుల విరామంతో తలస్నానం చేయవచ్చు.
4/6మందపాటి జుట్టు ఉన్న వారు వారానికి ఒకసారి తలస్నానం చేయడం మంచిది. జుట్టు ఒత్తుగా ఉండి చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు వారానికి రెండుసార్లు స్నానం చేస్తే మంచిది.
5/6పొడవాటి జుట్టు ఉన్నవారు జుట్టును తరచూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇతర జుట్టు రకాలతో పోలిస్తే దట్టమైన జుట్టు ఉన్న వారికి ఆయిల్, జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజు తలస్నానం చేయాలని ఉంటుంది. కానీ ప్రతి రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు పలుచబడుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తే మంచిది.
6/6ఉంగరాల జుట్టు ఉన్నవారు ప్రతి మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేస్తే మంచిది. వదులుగా పలుచగా జుట్టు ఉన్నవారు రోజు విడిచి రోజు తలస్నానం చేసినా మంచిదే. అధిక రసాయనాలుండే షాంపూలకు బదులు సహజ సిద్ధ మార్గాలను అనుసరిస్తే మంచిది.