Apps:
Follow us on:

Head Bath | తలస్నానం చేశాక ఈ పొరపాట్లు చేస్తున్నారా?

1/5తలస్నానం తర్వాత జుట్టును ఎండబెట్టడానికి టవల్‌ను ఉపయోగించడం కారణంగా జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. జుట్టు పొడిబారడం, పెళుసుగా తయారయ్యేందుకు ఇది కారణమవుతుంది. జుట్టుచివరలు చిట్లడం వంటి అవకాశాలను కూడా పెంచుతుంది.
2/5తలస్నానం అనంతరం జుట్టుపై సీరమ్ అప్లై చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా మంచి నిగారింపు వస్తుంది. జుట్టు డ్రై అయిన తర్వాత అరచేతిపై కొద్దిగా సీరమ్ తీసుకుని, రెండు చేతులతో రుద్ది క్రమంగా జుట్టు ముందు భాగం నుంచి బ్రష్ చేయడం మొదలు పెడితే జుట్టు రాలిపోకుండా ఉంటుంది.
3/5సూపర్ మార్కెట్లలో విరివిగా దొరికే హెయిర్ సీరమ్ తగిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. రెండు చేతులతో మృదువుగా జుట్టుకు అప్లై చేయాలి. ఎక్కువ మోతాదులో హెయిర్ సీరమ్ ఉపయోగించడం వల్ల ముఖం జిడ్డుగా అయ్యే అవకాశం ఉన్నది.
4/5కొందరు తడి జుట్టును పొడిగా చేయడానికి బ్లో- హెయిర్ డ్రయర్ వాడుతుంటారు. దీని కారణంగా జట్టు మీద ఉండే తేమ తగ్గిపోతుంది. క్రమంగా జుట్టు పొడిబారి పెళుసుగా మారుతుంది. ఈ అలవాటు మంచిది కాదు. వెంట్రుకలకు ప్రాచీన పద్ధతిలో ధూపం పట్టించడం మంచిది.
5/5తలస్నానం తర్వాత జుట్టును గట్టిగా రుద్దడం. నీళ్లుపోవాలని జుట్టును మెలేసి తిప్పడం సరికాదు. ఎక్కువగా నీటిని పీల్చుకునే అవకాశం ఉన్న టీషర్టును జుట్టుకు చుట్టాలి. వెంట్రుకలపై బలాన్ని ప్రయోగించవద్దు. టీషర్టు కొద్దిసేపటికే నీళ్లను పీల్చేస్తుంది.