జుట్టుకే కాదు కొబ్బరి నూనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా
Beauty Benefits of Coconut Oil | కొబ్బరినూనె.. కేశ సౌందర్యం నుంచి కాలిగోళ్ల ఆరోగ్యం వరకూ నఖశిఖం మేలుచేస్తుంది. రసాయనాలలో ముంచితేల్చిన క్రీముల కంటే.. ఇదే ఉత్తమం.
ముఖ సౌందర్యం: ఒకప్పుడు సౌందర్య సాధనమంటే కొబ్బరినూనే. కానీ ప్రస్తుతం రకరకాల క్రీములు, లోషన్లు యథేచ్చగా వాడేస్తున్నారు. కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అపారం. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. దీనివల్ల చర్మంపై మచ్చలు కూడా తగ్గుతాయి. కొబ్బరినూనెకు గాయాలను నయం చేసే శక్తి ఉంది.
మృదువైన గోళ్లు: బలహీనంగా, పెళుసుగా ఉన్న గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఒకటే మార్గం. కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు మర్దన చేసుకుంటే సరిపోతుంది.
స్వచ్ఛమైన శ్వాస: నోటి దుర్వాసన ఓ తీవ్ర సమస్య. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు హానికర క్రిములను అరికడతాయి. దుర్వాసననూ పరిహరిస్తాయి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే.. దంతాలకు మెరుపు వస్తుంది, నోటి దుర్వాసనా పోతుంది.
మృదువైన పెదాలు: పొడిబారిన, పగిలిన పెదాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అసౌకర్యంగానూ అనిపిస్తాయి. కొబ్బరినూనె మంచి మాయిశ్చరైజర్ కూడా. ఇది పెదాలను
సహజంగా, మృదువుగా మారుస్తుంది.
ఒత్తయిన జుట్టు: కొబ్బరినూనె జుట్టుకు బలాన్ని ఇస్తుంది. నిత్యం కొబ్బరి నూనె రాసుకోవడం, కొబ్బరినూనెతో మర్దన చేసుకోవడం కేశసంరక్షణలో ఓ భాగం.
అందమైన కనురెప్పలు: నేత్ర సౌందర్యంలో కనురెప్పలదే కీలక పాత్ర. ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చుక్క నిమ్మరసం, లావెండర్ కలిపి రోజూ రాత్రిపూట కనురెప్పలపై రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read More :
“ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!”
ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే”
Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”
అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
పాదాలు అందంగా కనిపించాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేసి చూడండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- hair
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

