శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jun 15, 2020 , 00:13:17

పేద మహిళలకు ఆర్థిక భరోసానిస్తున్న ప్రభుత్వం

పేద మహిళలకు ఆర్థిక భరోసానిస్తున్న ప్రభుత్వం

  • పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రుణ లక్ష్యం పూర్తి
  • నాలుగు మున్సిపాలిటీల్లో రూ.28 కోట్ల పంపిణీ

  కొత్తగూడెం అర్బన్‌: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల అభ్యున్నతికి అదెరువు లభిస్తున్నది. అందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అహర్నిశలూ కృషిచేస్తున్నది. మహిళ సంక్షేమానికి ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాల గురించి మెప్మా రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీ) ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. వారు ఆర్థికంగా స్థిరపడేలా సహాయ సహకారాలు అందిస్తున్నా రు. ప్రభుత్వం, స్త్రీనిధి బ్యాంకు అందిస్తున్న వడ్డీలేని రుణాలను,రాయితీలను, మహిళల కుటుంబ సభ్యుల అవసరాలకు తక్షణ రుణాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వంద శాతానికిపైగా రుణాలను అందించి చేయూతనందిస్తున్నారు.

రూ.28 కోట్ల  రుణాల పంపిణీ

గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20)లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.18.77 కోట్లను రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెప్మా ఆధ్వర్యంలో లక్ష్యానికి మించి రూ.28.52 కోట్లను అందించింది. దాదాపు 151 శాతం లక్ష్యాన్ని సాధించింది. నాలుగు మున్సిపాలిటీలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరుల్లో మొత్తం 543 పట్టణ పేదల సంఘాలకు ఈ రుణాలను అందించింది. కొత్తగూడెంలో 130 సంఘాలకు రూ.6.28 కోట్లు, పాల్వంచలో 164 సంఘాలకు రూ.8.42 కోట్లు, ఇల్లెందులో 103 సంఘాలకు రూ.6.18 కోట్లు, మణుగూరులో 146 సంఘాలకు రూ.7.63 కోట్లను రుణాలను మంజూరు చేసింది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటునందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు మున్సిపాలిటీల్లో 16 నూతన మహిళా సంఘాలను సైతం ఏర్పాటు చేసి ప్రభుత్వం మంజూరు చేసే రుణాలకు అర్హత పొందేందుకు శ్రీకారం చుట్టింది.

రుణాల చెల్లింపులతో నెరవేరిన లక్ష్యం

ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను అమలుపరుస్తూ మెప్మా వ్యక్తిగత రుణాల చెల్లింపులో సైతం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తున్నది. కొత్తగూడెంలో 15 మందికి, పాల్వంచలో 17 మందికి, ఇల్లెందులో 17, మణుగూరులో 17 మందికి రుణం అందించింది. ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందించి వారి కాళ్ల మీద వారు బతికేలా ఆదుకుంది. ఈ వ్యక్తిగత రుణంతో కిరాణా దుకాణం, జనరల్‌ స్టోర్‌, బ్యాంగిల్‌ స్టోర్‌, ఇతరత్రా షాపులను ఏర్పాటు చేసుకొని మహిళలు వ్యాపారాల్లో అభివృద్ధి చెందేలా చేయూత ఇస్తున్నారు. మొత్తం 55 మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా 66 మందికి రూ.60 లక్షలను రుణంగా అందించించి లక్ష్యాన్ని దాటింది. జాతీయ, పట్టణ జీవనోపాధుల మిషన్‌ ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీల్లో 2,568 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను అందజేసింది.  

మహిళల అభ్యున్నతి కోసమే రుణాలు

పట్టణ పేద మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తు న్నాం. మెప్మా ఆధ్వర్యంలో మ హిళలు అడిగిన వెంటనే వారి అర్హతను బట్టి రుణాలను మంజూరు చే స్తున్నాం. ఆ రుణాలను ఏవిధంగా స ద్వినియోగం చేసుకోవాలో ఆర్‌పీల ద్వా రా అవగాహన కల్పిస్తున్నాం. ఎప్పటికప్పు డు వ్యాపార మెళకువలను తెలియజేస్తు న్నాం. తీసుకున్న రుణం వారి జీవితాల్లో వెలుగులు నింపే లా, వారు ఆర్థికంగా స్థిరపడేలా కృషి చేస్తున్నాం. భవిష్యత్‌లో మరింత రు ణం పొందేందుకు అర్హత పొందాలి.     

-అరిగెల సంపత్‌కుమార్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌