ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు సెంటర్లో ఉన్న జిన్నా టవర్‌పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. భారతదేశంలోని టవర్‌కు పెట్టినే పాకిస్తాన్ జాతీయుడి పేరు మార్చాలంటూ బీజేపీ సహా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యలో 26 జనవరి రోజున మువ్వన్నెల జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన హిందూ సంఘాలకు చెందిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జిల్లా టవర్‌ను కూల్చేస్తామంటూ బీజేపీ హెచ్చరించడంతో దాని చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, తాజాగా ఈ వివాదానికి తాత్కాలిక పరిష్కారం లభించింది. దీంతో ఈ టవర్ జోలికి ఎవరూ రాకుండా ఉండేందుకు అధికారులు తెలివిగా వ్యవహరించారు. టవర్‌ను పెయింటింగ్‌ను మార్చేశారు. త్రివర్ణ పతాకం రంగులతో టవర్‌ను తీర్చిదిద్దారు. నిన్నటి వరకు వివాదస్పదంగా ఉన్న టవర్.. ఇప్పుడు మూడు రంగుల్లో మెరిసిపోతుండటంతో గుంటూరువాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టవర్‌కు జాతీయ జెండా రంగులు వేయడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్లయింది.
జిన్నా టవర్‌కు మువన్నెలు వేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రంగులు వేయడం బాగానే ఉంది కానీ, పేరు మార్చకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తక్షణమే దీని పేరును అబ్దుల్ కలాం టవర్గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. టవర్‌కు కలాం పేరు మార్చడానికి వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చునని, కలాం పేరు పెట్టడానికి ప్రభుత్వం సిగ్గు పడదని ఆయ అభిప్రాయపడ్డారు.