అమరావతి : వైసీపీ పార్లమెంటరీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి( YV Subbareddy) ఎన్నుకున్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ప్రకటించారు. శుక్రవారం పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి(Vijaysai reddy), లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి (Mitun reddy) వ్యవహరిస్తారని వెల్లడించారు.
పార్లెమెంట్లో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్సభ సభ్యులున్నారని, టీడీపీ(TDP) కి 16 మంది ఉన్నారని వివరించారు. వైసీపీ కూడా పార్లమెంట్లో బలమైన పార్టీయేనని స్పష్టం చేశారు. ఎంపీలు ధైర్యంగా ఉండి ప్రజల తరుఫున పోరాటం చేయాలని సూచించారు. పార్లమెంట్ సమావేశ సమయంలో వైసీపీ ఎంపీలు ప్రజాహితం కోసమే పోరాటం చేయాలని, రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.రాజకీయంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని జగన్ అన్నారు.