YSRCP | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై రేపోమాపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.