అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఢీకొన్న వాహనంలోనే ఉన్న ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి వృద్ధుడిని ఆస్పత్రికి తరలించకుండా అక్కడి నుంచి తప్పుకున్న వైనం అనంతపురంలో చోటు చేసుకుంది. శుక్రవారం అనంతపురం లేపాక్షి రోడ్డులో రోడ్డు దాటుతున్న మల్లయ్య అనే వృద్ధుడిని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వాహనం ఢీ కొట్టింది. అయితే తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడిని కనీసం ఆస్పత్రిలో చేర్పించాలన్న కనీన మర్యాద లేకుండా ప్రవర్తించడం విస్మయం కలిగించింది.
అతడికి డబ్బులిచ్చి ఆస్పత్రిలో చూయించుకోవాలని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కాగా ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు మల్లయ్య అపసార్మక స్థితిలోకి వెళ్లడంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.